ఉరి వేసుకుని యువతి మృతి

ABN , First Publish Date - 2022-12-04T23:00:26+05:30 IST

మండలంలోని కసుమూరు గ్రామంలోని కొండమీద ఓ యువతి ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది.

 ఉరి వేసుకుని యువతి మృతి
మృతి చెందిన మస్తాన్‌బీ

వెంకటాచలం, డిసెంబరు 4 : మండలంలోని కసుమూరు గ్రామంలోని కొండమీద ఓ యువతి ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు షేక్‌ అయేషా, ఆమె కుమార్తె మస్తాన్‌బీ (19) కొన్నేళ్లుగా కసుమూరు కొండమీద నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మస్తాన్‌బీ ఇంటిలో పై నున్న ఇనుపరాడ్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందింది. ఇష్టం లేని వివాహం చేస్తుండడంతోనే ఆమె మృతి చెంది ఉండవచ్చని సమాచారం. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఆయేషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-04T23:00:27+05:30 IST