పింఛన్ ఇప్పించాలని వినతి
ABN , First Publish Date - 2022-12-19T22:08:00+05:30 IST
నిరుపేద అయిన తనకు వృద్ధాప్య పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని సోమవారం తోటలచెరువుపల్లికి చెందిన షేక్ ఖాదర్‌బాష ఎంపీడీవో విజయభాస్కర్‌రావుకు వినతిపత్రం అందచేశా డు.
వెల్ఫేర్ అసిస్టెంట్ తీరుపై ఫిర్యాదు
వరికుంటపాడు, డిసెంబరు 19: నిరుపేద అయిన తనకు వృద్ధాప్య పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని సోమవారం తోటలచెరువుపల్లికి చెందిన షేక్ ఖాదర్‌బాష ఎంపీడీవో విజయభాస్కర్‌రావుకు వినతిపత్రం అందచేశా డు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏడాదిగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాఽథుడే కరువయ్యాడని పేర్కొన్నాడు. 75 ఏళ్ల వయసులో పింఛనుపైనే ఆధారపడిన తాను పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా వెల్ఫేర్ అసిస్టెంట్ హసనయ్య నిర్లక్ష్య వైఖరితో ఫలితం లేకుండా పోయిందన్నారు.అడిగిన ప్రతిసారి వచ్చే జనవరిలో మంజూరవుతుందని కుంటిసాకులు చెప్పిన ఆయన మాటలు నమ్మిన తాను ఇటీవల విడుదలైన జాబితాలో తన పేరు లేకపోవడం చూసి విస్తుపోయా నన్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఎంపీడీవో లాగిన్‌లో నిలిచిపోయిందని చెప్పారని, అక్కడికి వచ్చి ఆరా తీయగా సచివాలయం నుంచి ఎలాంటి దరఖాస్తు రాలేదని వారు చెప్పారని వాపోయాడు. వెల్ఫేరు అసిస్టెంట్‌పై తగిన చర్యలు తీసుకుని, పింఛను మంజూరు అయ్యేలా చూడాలని ఖాదర్‌బాష కోరాడు.
-------------------