జామాయిల్‌ కర్ర స్వాధీనం

ABN , First Publish Date - 2022-06-15T04:46:11+05:30 IST

మండలంలోని కసుమూరు - ఇస్లాంపేట గ్రామాల మధ్య అడవి నుంచి సోమవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న జామాయిల్‌ కర్రలను అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు.

జామాయిల్‌ కర్ర స్వాధీనం
అటవీ శాఖ అధికారులు సీజ్‌ చేసిన జామాయిల్‌కర్ర, ట్రాక్టర్‌

అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ సీజ్‌ 

వెంకటాచలం, జూన్‌ 14 : మండలంలోని కసుమూరు - ఇస్లాంపేట గ్రామాల మధ్య అడవి నుంచి సోమవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న జామాయిల్‌ కర్రలను అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్‌ రేంజర్‌, సెక్షన్‌ అధికారులు ఈ దాడులు చేశారు. జామాయిల్‌ కర్రలను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి నెల్లూరులోని తమ కార్యాలయానికి తరలించారు. ఇంకా అడవిలో భారీ స్థాయిలో కర్రను కొట్టి  ఉన్నారనీ, అటవీ అధికారులు దాడులు చేయకపోయి ఉంటే ఆ  కర్రను కూడా రాత్రికి రాత్రే  అమ్మకానికి తరలించే వారని స్థానికులు చెబుతున్నారు. ఆదివారమైతే పట్టపగలే యథేచ్ఛగా ట్రాక్టర్లలో కర్రను తరలిస్తున్నా కొందరు స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలిసీ తెలియనట్టుగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. 

Updated Date - 2022-06-15T04:46:11+05:30 IST