Nellore: శరత్ చంద్రారెడ్డిని, ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎందుకు కలిశారు?: ఆనం వెంకటరమణారెడ్డి
ABN , First Publish Date - 2022-11-22T12:05:09+05:30 IST
థావూస్‌కు వెళ్లి జగ్గూభాయ్ ఏం చేశారని, బేగంపేట ఎయిర్ పోర్టు నుంచే వెళ్లాల్సిన అవసరం ఏమిటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు.
నెల్లూరు: థావూస్‌కు వెళ్లి జగ్గూభాయ్ ఏం చేశారని, బేగంపేట ఎయిర్ పోర్టు నుంచే వెళ్లాల్సిన అవసరం ఏమిటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గన్నవరం ఎయిర్ పోర్టులో స్పెషల్ ఫ్లైట్ ల్యాండ్ కాదా? అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున నల్లధనం, బంగారం తరలించేందుకే బేగంపేట నుంచి వెళ్లారని విమర్శించారు. జగ్గూభాయ్ ధావూస్ పర్యటనలో మూడు రోజులు మాయమయ్యారని, అరబిందో వాళ్లని జగ్గూభాయ్ కలిశారా? లేదా? అని ప్రశ్నించారు. జగ్గూభాయ్ మాఫియాతో మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధాలున్నాయన్నారు.
ఈడీ విచారణలో రిమాండ్ ఖైదీగా ఉన్న శరత్ చంద్రారెడ్డిని, ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎందుకు కలిశారని వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. బాబాయ్‌ని చంపిన గొడ్డలికి ఇంకా రక్తం మరకలు ఆరలేదని బెదిరించడానికా, జగ్గూభాయ్.. అమిత్ షా కాళ్లుపట్టుకుని అయినా కాపాడతాడని చెప్పడానికా? అని అన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న శరత్ చంద్రారెడ్డితో, ఎమ్మెల్యే చెవిరెడ్డిని ఈడీ, సీబీఐ అధికారులు ఎలా కలవనిస్తారని ప్రశ్నించారు. శరత్ చంద్రారెడ్డి ప్రాణాలకి జగ్గూభాయ్ మాఫియా వల్ల ప్రాణహాని ఉందని, ఈడీ, సీబీఐ అధికారులు వెంటనే జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలన్నారు. మద్యం గురించి అడిగితే, హెరిటేజ్ పాల గురించి మాట్లాడతారని.. ఓరేయ్... మద్యానికి, పాలకి ఏమైనా సంబంధం ఉందరా? అంటూ మండిపడ్డారు. అదానీ డిస్టలరీస్ నుంచి రూ.వందకోట్లు చేబదులు ఎందుకు తీసుకున్నారని ఆనం వెంకటరమణారెడ్డి నిలదీశారు.