చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం
ABN , First Publish Date - 2022-12-23T21:49:09+05:30 IST
బెదిరించడం, దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వానికి చరమగీతం పాడి ఈ రాష్ట్రానికి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం అని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు.
లింగసముద్రం, డిసెంబరు 23 : బెదిరించడం, దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వానికి చరమగీతం పాడి ఈ రాష్ట్రానికి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యం అని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు చెప్పారు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం, ఇతర నాయకులతో కలిసి మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 28న కందుకూరు నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేయాలని ప్రతి గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కలిసికోరారు. కందుకూరు పట్టణంలో రోడ్ షో అనంతరం ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారని తెలిపారు. శివరాం మాట్లాడుతూ జగన్ చేతకాని పాలనతో ఇబ్బందులు పడని కుటుంబమే లేదని, ఇంతటి దుర్మార్గమైన పాలన ప్రజలు చూడలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వేముల గోపాలరావు, నాయకులు బి.నాగేశ్వరరావు, సయ్యద్ నాయబ్ రసూల్, పి మాల్యాద్రి, కె కొండయ్య, జి వెంకటేశ్వర్లు, ఉన్నం మాల్యాద్రి, జి వెంకటరత్నం, షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు.