AP News: నందిగామలో దారుణం

ABN , First Publish Date - 2022-11-02T10:41:39+05:30 IST

జిల్లాలోని నందిగామలో దారుణం జరిగింది. నందిగామ మండలం పల్లగిరి గట్టు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

AP News: నందిగామలో దారుణం

ఎన్టీఆర్: జిల్లాలోని నందిగామలో దారుణం జరిగింది. నందిగామ మండలం పల్లగిరి గట్టు వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు కీసర గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి వచ్చిన వెంకటేశ్వరావు హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు... ఆర్థిక కారణాల లేక ఇతరుల కారణాల అనే కోణంలో విచారణ చేపట్టారు.

Updated Date - 2022-11-02T10:41:40+05:30 IST