Home » Nandigama
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నందిగామ హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున చేరుకున్నారు.
Nandigama Municipal Chairman: నందిగామ మున్సిపల్ చైర్మన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటేశారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు.
నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో ట్విస్ట్.. సోమవారం నుంచి దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న శాకమూరి స్వర్ణలతకు టీడీపీ హై కమాండ్ బీ ఫారం పంపించింది. అయితే ఆ పేరును తాము అంగీకరించబోమని ఎమ్మెల్యే సౌమ్య కౌన్సిలర్లను పక్కను పెట్టుకుని సమావేశానికి రాలేదు.
నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన నరసింహారావు అనే వ్యక్తికి ఓ కుమార్తె ఉంది. ఆమె 14 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో తన పరువు పోయిందని నరసింహారావు రగిపోయాడు.
ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మండలం, చందాపురంలో విషాదం చోటు చేసుకుంది. చందాపురం, నల్లవాగు చప్తా రైలింగ్ వద్ద ఇద్దరు వ్యక్తులు కూర్చొని మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో వంతెనపై నుండి నీటిలో పడి మృతి చెందారు. మృతులు చందాపురంకు చెందిన సత్యం, జయరాజుగా గుర్తించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొందరు వ్యక్తులు గంజాయి తరలిస్తు్న్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏసీపీ తిలక్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
నందిగామ(Nandigama) నియోజకవర్గం చందర్లపాడు మండలం ముప్పాళ్ల(Muppalla) గురుకుల పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థిని కస్తాల అపర్ణ(12) మృతి చెందడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది.
ధ్యానం జీవితానికి దిశను చూపుతుందని, మనసుకు స్థిరత్వాన్ని ఇస్తూ జీవితంలో ఎదిగేలా చేస్తుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు.
శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అర్చిత(Archita) ఆత్మహత్య ఘటనపై విచారణకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశాలు జారీ చేశారు. బలవన్మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర ప్రజలంతా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. జూన్4 ఎప్పుడు వస్తుందా అంటూ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఏ నియోజకవర్గం ఫలితం ముందు వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంతో ఓట్ల లెక్కింపు సులభతరమైంది.