PM Modi to CM Jagan: సీఎం జగన్‌ను ఊహించని ప్రశ్న అడిగిన ప్రధాని మోదీ
ABN , First Publish Date - 2022-12-05T20:57:12+05:30 IST
రాజధాని న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్న జగన్‌మోహన్ రెడ్డికి (Jagan Mohan reddy) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.
న్యూఢిల్లీ: రాజధాని న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం, వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్న జగన్‌మోహన్ రెడ్డికి (Jagan Mohan reddy) ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. సోదరి షర్మిల అరెస్ట్‌ను (Sharmila Arrrest) ఎందుకు ఖండించలేదని జగన్‌ను ప్రధాని ప్రశ్నించారు. షర్మిల కారులో ఉండగానే క్రేన్‌తో లిఫ్ట్ చేసి లాక్కెళ్లిన తీరు బాధ కలిగించిందని మోదీ వ్యాఖ్యానించారు. కాగా ఊహించని ఈ పరిణామానికి సీఎం జగన్ షాక్‌కు గురయ్యారు. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నవ్వుతూ నిలబడ్డారు.
కాగా ఇటివల వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తన కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ శ్రేణులు దాడి చేశాయి. ఈ దాడికి నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న వైఎస్ షర్మిలను పంజాగుట్టలో పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల సహా నలుగురు వ్యక్తులు ఉండగానే కారును క్రేన్‌తోనే లిఫ్ట్ చేసి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత పీఎస్ వద్ద బలవంతంగా కారు డోర్లు తెరిచి షర్మిలను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు తరలించి 14ఏసీ ఎంఎం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం వ్యక్తిగతపూచీకత్తుపై నాంపల్లి కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈ పరిణామం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. రాజకీయ వేడిని పుట్టించింది. ఒక మహిళని కూడా చూడకుండా పోలీసులు ఈ విధంగా వ్యవహరించడాన్ని గవర్నర్ తమిళిసై సహా పలువురు రాజకీయ నాయకులు ఖండించిన విషయం తెలిసిందే.