Home » Narendra Modi
కువైట్ అత్యున్నత పురస్కారాన్ని అందజేయానికి ముందు కువైట్ బయన్ ప్యాలెస్ వద్ద మోదీకి "గార్డ్ ఆఫ్ హానర్''తో సాదర స్వాగతం పలికారు. కువైట్ దేశ రాజు షేక్ మిషాల్ అల్అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ కరచనాలతో ఆత్మీయ స్వాగతం తెలిపారు.
ఏ దేశానికి వెళ్ళినా, ఆ దేశ ప్రజలు-భారతీయుల మధ్య సత్సంబంధాలను పటిష్ట పరచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్య నీతి సాగుతోంది. బహుళ ధ్రువ ప్రపంచంలో ఎటువైపూ వాలిపోకుండా, సమాన దూరం పాటిస్తూ, సమతుల్యతతో అన్ని దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు.
రెండ్రోజుల కువైట్ పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో శనివారం సాయంత్రం నిర్వహించిన 'హలా మోదీ' కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ దేశ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించి ప్రశంసిస్తుంటారని అన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్‌లోని గల్ఫ్ స్పిక్ లేబర్ క్యాంప్‌ను శనివారంనాడు సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికులను కలుసుకున్నారు.
మోదీ తన పర్యటనలో కువైట్ అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, వాణిజ్యంపై ప్రధానమంత్రి దృష్టి సారించనున్నట్టు చెబుతున్నారు.
ఎన్హెచ్ఆర్సీ చైర్మన్‌ను ఎంపిక చేసే కమిటీలో మోదీ, అమిత్‌షా, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా ఉన్నారు.
పాకిస్థాన్ సైన్యం 1971 డిసెంబర్లో భారత బలగాల ముందు లొంగిపోయిన రోజును 'విజయ్ దివస్'గా జరుపుకొంటాం. బంగ్లాదేశ్ మాత్రం మార్చి 26న 'ఇండిపెండెన్స్ డే' జరుపుతుంది.
భారతదేశ ప్రయోజనాలను హానికలిగించే ఎలాంటి కార్యక్రమాలకు తమ భూభాగంలో అనుమతించే ప్రసక్తే లేదని దిశనాయకే ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం శ్రీలంక ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని తమకు హామీ ఇచ్చినట్టు చెప్పారు.
Debate on Constitution: రాజ్యంగంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. ఇవి దేశం గర్వపడే లక్షణాలని పేర్కొన్నారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా చేసుకునే క్షణాలివి అని పేర్కొన్నారు.
దేశాన్ని 55 ఏళ్లు పాలించిన నెహ్రూ-గాంధీ కుటుంబమే రాజ్యాంగాన్ని అత్యధికంగా దుర్వినియోగం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.