విధ్వంసక పాలనతో విసుగెత్తిన ప్రజలు
ABN , First Publish Date - 2022-11-16T23:23:34+05:30 IST
జగన్ విధఽ్వంసక, వినాసక పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తిపోయారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. టీడీపీ అద్దంకి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, ఆర్‌టీఎస్ శిక్షణా కార్యక్రమం, జనరల్ ఓటర్ వెరిఫికేషన్‌పై నాయకులు, కార్యకర్తలతో బుధవారం స్థానిక నాగులపాడు రోడ్డు లోని కామేపల్లి కల్యాణ మండపంలో నిర్వహించారు.
ఓట్ల తొలగింపునకు వైసీపీ నేతల యత్నాలు
టీడీపీ అద్దంకి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి
భారీగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు
అద్దంకి, నవంబరు16: జగన్ విధఽ్వంసక, వినాసక పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తిపోయారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. టీడీపీ అద్దంకి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, ఆర్‌టీఎస్ శిక్షణా కార్యక్రమం, జనరల్ ఓటర్ వెరిఫికేషన్‌పై నాయకులు, కార్యకర్తలతో బుధవారం స్థానిక నాగులపాడు రోడ్డు లోని కామేపల్లి కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన గురించి ప్రజలకు తెలియజేస్తూ ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో రాష్ర్టానికి చం ద్రబాబునాయుడు నాయకత్వ ఆవశ్యకతను విరించాలన్నారు. మేధావులు, విద్యావంతులు జగన్ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం అత్యంత కీలకమన్నారు. ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చి గెలిచాక దారుణంగా మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చాలని నిరసనలు చేస్తున్న టీచర్లపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ నేతలు గ్రామాలలో ఓట్లు తొలగించేందుకు కు ట్రలు చేస్తున్నారని, క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. జగన్‌రెడ్డి పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలు అయ్యిందన్నారు. రైతు ఆత్మహత్యలలో దేశంలో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ. 7,200 కోట్లు పక్కదారి పట్టించారన్నారు. దళిత భూములలో అత్యధిక భాగం కొల్లగొట్టిన ఘనత జగన్ హయాంలోనే అన్నారు.
ఆర్‌టీఎస్ ట్రైనర్ గుంటుపల్లి శ్రీదేవి మాట్లాడుతూ పార్టీ కార్య క్రమాలను క్షేత్ర స్థాయిలోకి , క్షేత్ర స్థాయి సమస్యలు పార్టీ అదిష్ఠానానికి తీసుకు వెళ్లటం ఆర్‌టీఎస్ ముఖ్య ఉద్దేశమన్నారు. ముందుగా అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాలలో తూర్పురాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఆర్ టీఎస్ శిక్షకురాలు గుంటుపల్లి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్, నియోజకవర్గ పరిశీలకుడు షేక్ సమీన్‌ఖాన్, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ, టీడీపీ నాయకులు కరి పరమేష్, మానం మురళీమోహన్‌దా్‌స, గార్లపాటి శ్రీనివాసరావు, బాపట్ల పార్లమెంట్ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు బత్తుల రామకోటయ్య, పట్టణ, మండల పార్టీల అధ్యక్షుడు చిన్ని శ్రీనివాసరావు, కఠారి నాగేశ్వరరావు, ఇస్రాయిల్, రావూరి రమేష్, జాగర్లమూడి జయకృష్ణ, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలు, గ్రామపార్టీ అధ్యక్షులు, అనుబంధసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.