పాత కక్షలతో దారుణ హత్య

ABN , First Publish Date - 2022-11-01T00:24:22+05:30 IST

సంతమాగులూరు మండలంలోని రామిరెడ్డిపాలెం టోల్‌ గేటు వద్ద ఆదివారం రాత్రి కామే పల్లి ఎస్పీ కాలనీకి చెందిన లక్కెపోగు కోట య్య అలియాస్‌ కోటేశ్వరరావు(39) దారుణ హత్యకు గురయ్యాడు.

పాత కక్షలతో దారుణ హత్య

సంతమాగులూరు, అక్టోబరు 31: మండలంలోని రామిరెడ్డిపాలెం టోల్‌ గేటు వద్ద ఆదివారం రాత్రి కామే పల్లి ఎస్పీ కాలనీకి చెందిన లక్కెపోగు కోట య్య అలియాస్‌ కోటేశ్వరరావు(39) దారుణ హత్యకు గురయ్యాడు. అందిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితం కాల నీలో డీజే విషయంలో కోటయ్య, లక్కె పోగు సుబ్బారావు వర్గాల మధ్య ఘ ర్ష ణ జరిగింది. ఆ ఘర్షణలో సుబ్బారావు కు తీవ్రగాయాలుకాగా, నరసరావుపేట లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ కేసులో ప్రధాన ముద్దాయి అయిన కోటయ్య ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉండ టంతో తన అక్క గారి ఊరైన ఏల్చూరులో ఉంటున్నాడు.

ఆదివారం రాత్రి కోటయ్య బావ పల్లెపోగు పోతురాజు కా మేపల్లిలోని బంధువుల దగ్గరకు వచ్చాడు. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు పల్లెపోగు కోటయ్యకు ఫోన్‌చేసి మీ బావ పోతురాజు, ప్రత్యర్థుల మధ్య గొడవ జరుగుతుందని, పుట్టావారిపాలెం పోలీసు స్టేషన్‌కు రావాలనితెలియజేశారు. దీంతో కోటయ్య ఏల్చూరు నుంచి మోటారు సైకిల్‌పై పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. అక్కడ పోలీ సులతో కామేపల్లిలోని ఎస్సీ కాలనీలో మా బావ పోతురాజుపై ఘర్షణ జరు గుతుందని పోలీసులకు తెలియజేసి గ్రామానికి వెళ్ళాలని కోరాడు. సమా చారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామంలో ఎలాంటి గొడవలు లేవని తెలి పారు. కోటయ్య అక్కడ గొడవలు లేవని తెలుసుకొని తన మోటారు సైకిల్‌పై ఏల్చూరుకు తిరిగి వెళుతున్నారు. రామిరెడ్డిపాలెం టోల్‌గేట్‌ వద్దకు రాగానే కోట య్య వెనకాల మోటారు సైకిల్‌ పై వస్తున్న వ్యక్తులు కర్రలతో తలపై దాడి చే శారు. దీంతో కోటయ్య హైవే రహదారిపై పడి పోవడంతో అక్కడినుంచి రోడ్డు మార్జిన్‌లోకి లాక్కుపోయారు. అక్కడ పెద్ద బండ రాయితో తలపై మోదటం తో కోటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కోటయ్యకు భార్య, ముగ్గురు పిల్ల లు ఉన్నారు. కోటయ్య మృతితో కామేపల్లి ఎస్సీ కాలనీలో, ఏల్చూరు ఎస్సీ కాల నీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

విషయం తెలుసుకున్న సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ నాగశివారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ ఐ నాగశివారెడ్డి తెలిపారు. విషయం తెలుసుకున్న అద్దంకి నియోజక వర్గ వైసీ పీ ఇన్‌చార్జ్‌ బాచిన కృష్ణచైతన్య సోమవారం మృతిచెందిన కోటయ్య కుటుం బ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2022-11-01T00:24:33+05:30 IST