పొగాకు సాగు విస్తీర్ణం పెంచొద్దు

ABN , First Publish Date - 2022-07-19T05:14:56+05:30 IST

పొగాకు రైతులకు ఈ ఏడాది మంచి ధరలు వచ్చా యని, సాగు విస్తీర్ణం పెంచవద్దని పొగాకు బోర్డు ఆర్‌ఎం ఎం.లక్ష్మలణరావు అన్నారు.

పొగాకు సాగు విస్తీర్ణం పెంచొద్దు
టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో చివరి రోజు జరుగుతున్న అమ్మకాలు

మంచి ధరలపై హర్షం

ఆర్‌ఎం లక్ష్మణరావు

ఒంగోలు(రూరల్‌) జూలై 18 : పొగాకు రైతులకు ఈ ఏడాది మంచి ధరలు వచ్చా యని, సాగు విస్తీర్ణం పెంచవద్దని పొగాకు బోర్డు ఆర్‌ఎం ఎం.లక్ష్మలణరావు అన్నారు. ఒం గోలు పొగాకు బోర్డు వేలం కేంద్రం-2లో సో మవారం పొగాకు వేలం ముగింపు కార్యక్ర మం జరిగింది. ఈ సందర్భంగా రైతులతో జరిగిన సమావేశంలో లక్ష్మణరావు మా ట్లాడుతూ బోర్డు అనుమతి మేరకు రైతులు పొగాకు వేయాలన్నారు.  అంతకు మించి సాగు చేస్తే ఇబ్బందిపడతారన్నారు. అంత ర్జాతీయ మార్కెట్‌ ధరలపై ఆధారపడి పొగా కు వ్యాపారం ఉంటుందన్నారు. ఈ సంవ త్సరం మంచి ధరలు రావడం సంతోషకర మన్నారు. బోర్డు వేలం నిర్వహణాధికారి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఎలాంటి అంత రాయం లేకుండా, సెలవులు లేకుండా 90 రోజులలో వేలాన్ని ముగించామన్నారు.   మొ త్తం 6.94 మిలియన్‌ కేజీల పొగాకు అమ్మ కాలు జరిగినట్లు తెలిపారు.  బోర్డు సభ్యుడు పొదావర ప్రసాద్‌ మాట్లాడుతూ 30 సంవత్స రాలలో ఈ సారి మంచి ధరలు వచ్చాయ న్నారు.  ఐటీసీ లీఫ్‌ మేనేజర్‌ శివకుమార్‌, జీపీఐ ప్రతినిధులు ప్రభాకర్‌రావు, శ్రీనివాస రెడ్డి, రైతు నాయకుడు వడ్డెల్ల వరప్రసాద్‌, పె నుబోతు సునీల్‌, నల్లూరి వెంకటేశ్వర్లు, అనుబ్రోలు కోటేశ్వరరావు మాట్లాడారు. అనం తరం రైతులను, వ్యాపార సంస్థల ప్రతి నిధులను, కార్యాలయ ఉద్యోగులు, ముఠా కార్మికులను సన్మానించారు.  కార్యక్రమంలో రైతు నాయకులు పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దొడ్డా శీతారామయ్య, యర్రంనేని వెంకటశేషయ్య, దుగ్గినేని మల్లికార్జునరావు, బండారు రామాం జనేయులు, రైతులు పాల్గొన్నారు. 

టంగుటూరు కేంద్రంలో 

ముగిసిన పొగాకు అమ్మకాలు

టంగుటూరు : టంగుటూరు వేలం కేంద్రంలో పొగాకు అమ్మకాలు సోమవారంతో ముగిశాయి. వేలం కేంద్రం అధికారులు ముందస్తు ప్రణాళికతో జరిపిన వేలం ప్రక్రియతో కేవలం 90 రోజుల్లోనే 9.08 మిలియన్‌ కేజీల పొగాకు అమ్మకాలు జరిపి రికార్డు సృష్టించారు. ఈసారి కేవలం తక్కువ పనిదినాల్లో జరిపిన వేలం నిర్వహణతో బోర్డు నిర్ణీత దిగుబడుల అమ్మకాలు పూర్తి చేయడమేకాకుండా వేలం ప్రక్రియలో మరికొన్ని రికార్డులను  సొతం చేసుకుంది. వేలం చివరి రోజు వరకు రైతులకు దక్కిన సగటు ధర రూ. 174.53 కాగా గత ఏడాది ఆఖరుకు లభించిన సగటు ధర రూ.132.41 మాత్రమే.గత ఏడాది కంటే ఈసారి లభించిన సగటు  రూ.42 అధికం కావడం విశేషం. ఈధర నల్లరేగడి భూముల్లోని వేలం కేంద్రాలన్నింటి కంటే అధికం కావడంపై అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే క్వాంటిటీ పొగాకును 122 రోజుల్లో జరిగిన వేలం ద్వారా అమ్మకాలు పూర్తి చేయగా ఈసారి కేవలం 90 రోజుల్లోనే పూర్తి చేశారు. 100 రోజుల్లో పొ గాకు అమ్మకాల ప్రక్రియ ముగించాలన్న టు బాకో బోర్డు అధికారుల ప్రయత్నాలు, రైతుల కోరిక ఈసారి 10 రోజులు మందుగానే నిజం అయ్యాయి. పొగాకుకు గ్రేడ్‌ వైజ్‌గా మినిమమ్‌ ధర నిర్ణయించుకొని, ప్రారంభం నాటి నుంచి కూడా అధిక బేళ్లను వేలంకు పెడుతూ, గడచిన కర్నాటక మార్కెట్‌కు తగినట్లుగా వేలం నిర్వహించడం ద్వారానే ఎలాంటి వివాదానికి తావు లేకుండా తక్కువ రోజుల్లోనే అమ్మకాలు పూర్తి చేయకలిగామని వేలం నిర్వహణాధికారి ఏ. శ్రీనివాసరావు తెలిపారు. సరాసరిన రోజుకు లక్ష కేజీల పొగాకు అమ్మకాలు జరిపారు. అమ్మకాల చివరినాటికి రైతులకు దక్కిన అత్యధిక ధర రూ.194 కాగా, అత్యల్ప ధర రూ.80గా ఉంది. మీడియం గ్రేడ్లు ,లోగ్రేడ్ల అమ్మకాలు ఊపందుకోవడం వలనే సగటు ధరలు పెరిగాయి. ఇతర  కిందిస్థాయి పొగాకు గ్రేడ్ల అమ్మకాలు కూడా జరిగాయి. ధరలు ఆశాజనకంగా ఉండడంతో ఈసారి రైతులు ఆనందంగా ఉన్నారు.


Updated Date - 2022-07-19T05:14:56+05:30 IST