మున్సిపాలిటీగా కనిగిరి
ABN , First Publish Date - 2022-07-16T04:34:37+05:30 IST
కనిగిరి నగరపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీఓ జారీ చేసింది. గత మూడేళ్లుగా కనిగిరిలో 2019-20 లో రూ. 9.89 కోట్లు, 2020-21 లో రూ. 13.18 కోట్లు ,2021-22 లో రూ. 19.85 కోట్లు నగరపంచాయతీకి ఆదాయం వచ్చినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయం ప్రకారం ఇప్పటికే అదనంగా రూ. 4కోట్లు ఉండటంతో 1994 మున్సిపల్ కౌన్సిల్ నగరపంచాయతీ నిబంధనల చట్టం ప్రకారం కనిగిరి నగరపంచాయతీని సెకెండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మీ జీఓ జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు త్వరలో అందనున్నాయి.
- జీఓ జారీ చేసిన ప్రభుత్వం
కనిగిరి, జూలై 15: కనిగిరి నగరపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీఓ జారీ చేసింది. గత మూడేళ్లుగా కనిగిరిలో 2019-20 లో రూ. 9.89 కోట్లు, 2020-21 లో రూ. 13.18 కోట్లు ,2021-22 లో రూ. 19.85 కోట్లు నగరపంచాయతీకి ఆదాయం వచ్చినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయం ప్రకారం ఇప్పటికే అదనంగా రూ. 4కోట్లు ఉండటంతో 1994 మున్సిపల్ కౌన్సిల్ నగరపంచాయతీ నిబంధనల చట్టం ప్రకారం కనిగిరి నగరపంచాయతీని సెకెండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మీ జీఓ జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు త్వరలో అందనున్నాయి. అయితే గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అవుతున్న కనిగిరిలో ఇంటిపన్నులు పెరుగనున్నాయా అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. అదే విధంగా నగరపంచాయతీగా మారి ఇప్పటికే 10 ఏళ్ళు కావస్తున్నప్పటికీ మంచినీటి సమస్య, రోడ్ల ఆక్రమణలు అలాగే ఉన్నాయి. ఈ తరుణంలో పాలకులు ప్రజలకు ఏ విధంగా జవాబు దారీ కానున్నారో వేచి చూడాల్సి ఉంది.