రాష్ట్రానికి పట్టిన ఖర్మను వదిలించుకుందాం

ABN , First Publish Date - 2022-12-03T00:39:31+05:30 IST

రాష్ట్రానికి పట్టిన ఖర్మను వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు.

రాష్ట్రానికి పట్టిన ఖర్మను వదిలించుకుందాం

పొదిలి రూరల్‌ డిసెంబరు 2 : రాష్ట్రానికి పట్టిన ఖర్మను వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మం డలంలోని అక్కచెరువు మాజీ సర్పంచ్‌ వేల్పుల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ‘ఇదేంఖర్మ’ కార్య క్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మధ్యతరగతి కుటుంబాలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శిం చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిరుపయో గంగా వదలేశారని ఎద్దేవ చేశారు. ఇసుక కొరతతో నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారన్నారు. మధ్యనిషేధం అని చెప్పిన జగన్‌రెడ్డి ప్రపంచం లో లేని బ్రాండ్లను సొంతంగా నాసిరకం మద్యా న్ని తయారుచేసి అమ్మిస్తూ సొమ్ము చేసుకుం టున్నారని ఎద్దేవ చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొన్ని ప్రాజెక్టులు 70 శాతం పనులు పూర్తి చేస్తే జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత కనీసం పనులు ప్రారంభిం చలేదని విమర్శించారు. ప్రస్తుతం రోడ్లు ఎక్కడ చూసిన చిన్నకుంటలను తలపిస్తున్నాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మీగడ ఓబులరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్‌, మాజీ జడ్పీటీసీ మాజీ సభ్యుడు కాటూరి పెదబాబు, జిల్లా కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వరెడ్డి, ఎస్సీసెల్‌ నాయకులు ఠాగూర్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి కాటూరి శ్రీను, పోపూరి నరేష్‌, బొడ్డు సుబ్బయ్య, షేక్‌ మహమ్మద్‌ ఆలి, నాయకులు పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : రాష్ట్రంలో అసమర్థ పాలన సాగిస్తున్న వైసీపీని గద్దె దించేందుకు ప్రజానికం సిద్ధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాలుగవ వార్డులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు వైసీపీని గద్దెదించేందు కు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వార్డులో ఇంటింటికి పర్యటిస్తూ, వైసీపీ చేస్తున్న అరాచక, అసమర్థ పాలన గురించి వివరిం చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వి.మల్లిఖార్జున, టి.సత్యనారాయణ, కందుల రామిరెడ్డి, షేక్‌.మౌలాలి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-03T00:39:33+05:30 IST