మాగాణిగా వీధి - నాట్లు వేసి మహిళల నిరసన

ABN , First Publish Date - 2022-09-04T07:24:17+05:30 IST

ఎర్రగొండపాలెం మేజరు పంచాయతిలోని ఆసీఫ్‌నగర్‌ వీధి గ్రావెల్‌ రోడ్డుపై గుంతలు ఏర్పడి రోజులు తరబడి వర్షంనీరు వీధిలో నిల్వఉండి మాగాణి భూమిని తలపిస్తుండడంతో మహిళలు శనివారంసాయంత్రం వరినాట్లు నాటి నిరసన తెలిపారు.

మాగాణిగా వీధి - నాట్లు వేసి మహిళల నిరసన
నాట్లు వేస్తున్న మహిళలు


ఎర్రగొండపాలెం, సెప్టెంబరు 3 : ఎర్రగొండపాలెం మేజరు పంచాయతిలోని ఆసీఫ్‌నగర్‌ వీధి గ్రావెల్‌ రోడ్డుపై గుంతలు ఏర్పడి రోజులు తరబడి వర్షంనీరు వీధిలో నిల్వఉండి మాగాణి భూమిని తలపిస్తుండడంతో మహిళలు శనివారంసాయంత్రం వరినాట్లు నాటి నిరసన తెలిపారు. ఎక్కడ ఎక్కడ మురికి నీరు వచ్చి మాఇండ్ల ముంగిట నిల్వ ఉండి దుర్వాసనతోపాటు, దోమలు వ్యాప్తి చెంది అనారోగ్యానికి గురిఅవుతున్నామని మహిళలు తెలిపారు. పంచాయతి అధికారులకు ఎన్ని పర్యాయాలు విన్నవించిన ఉపయోగంలేదని , వరినాట్లు నాటి నిరసన తెలుపుచున్నామని తెలిపారు. 30 నివాసగృహాలు ఉన్నాయని పిల్లలు, పెద్దలం ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-09-04T07:24:17+05:30 IST