జాతీయ స్థాయిలో రాణించాలి
ABN , First Publish Date - 2022-10-23T23:41:48+05:30 IST
బేస్‌బాల్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాలని జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ య న్నాబత్తిన అరుణ అన్నారు.
జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ అరుణ
హోరాహోరీగా రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలు
సింగరాయకొండ, అక్టోబరు 23 : బేస్‌బాల్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించాలని జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ య న్నాబత్తిన అరుణ అన్నారు. ఆదివారం మండలంలోని పాతసింగరాయకొండ క్రీడా ప్రాంగణంలో జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ రాష్ట్ర స్థాయి పోటీలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని చెప్పారు. బాలుర విభాగంలో 11 జిల్లాలు, బాలికల విభాగంలో 10 జిల్లాల జట్టు పాల్గొన్నాయి. హోరాహోరీగా జరిగిన పోటీల్లో బాలుర విభాగంలో విజయనగరం, నెల్లూరు జట్లు తలపడగా (8-0)తో విజయనగరం జట్టు గెలిచింది. గుంటూరు, తూర్పు గోదావరి జట్ల మధ్య జరిగిన పోటీల్లో (6-0)తో గుంటూరు జట్టు విజయం సాధించింది. విశాఖపట్నం, కడప జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో (5-7)తో కడప జిల్లా విజేతగా నిలిచింది. నెల్లూ రు, చిత్తూరు మ ధ్య జరిగిన పోటీ ల్లో (2-5) తో చి త్తూరు జట్టు గెలి చింది. ప్రకాశం, కృ ష్ణా జిల్లాల మధ్య జరిగిన మ్యాచ్‌లో (7-0)తో ప్రకాశం జట్టు విజేతగా నిలిచింది. తూర్పుగోదావరి, అనంతపురం జట్లు తలపడగా (0-5) తేడాతో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. విజయనగరం, చిత్తూరు జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో (10-2) తేడాతో విజయనగరం జట్టు గెలిచింది. బాలికల విభాగంలో కర్నూలు, చిత్తూరు జిల్లాల మధ్య జరిగిన మ్యాచ్‌లో (7-0) తేడాతో కర్నూలు గెలిచింది. విజయనగరం, విశాఖపట్నం జట్లు తలపడగా (2-0)తో విజయనగరం విజయం సాధించింది. చిత్తూరు, గుంటూరు మధ్య జరిగిన పోటీల్లో (6-8) తేడాతో గుంటూరు, ప్రకాశం, కృష్టా మధ్య జరిగిన పోటీల్లో (7-2) తేడాతో ప్రకాశం జట్లు విజేతలుగా నిలిచారు. నేడు బాలుర, బాలికల రెండు విభాగాల్లో క్వార్టర్, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బేస్‌బాల్ సెక్రటరీ మల్లికార్జునరెడ్డి, బేస్‌బాల్ సీఈవో జి. మాధవరావు, జిల్లా సెక్రటరీ వి. వేమారెడ్డి, జాయింట్ సెక్రటరీ అన్వర్‌బాబు, వైసీపీ నేతలు యన్నాబత్తిన వెంకటేశ్వరరావు, గాలి నరసింహారావు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ చిమటా సుధాకర్ పాల్గొన్నారు.