TS News: వెస్ట్‌మారెడ్‌పల్లి కస్తూర్బా కళాశాలలో మరోసారి ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-12-27T14:40:34+05:30 IST

సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లి కస్తూర్బా కళాశాలలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.

TS News: వెస్ట్‌మారెడ్‌పల్లి కస్తూర్బా కళాశాలలో మరోసారి ఉద్రిక్తత

హైదరాబాద్: సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లి కస్తూర్బా కళాశాలలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్యాస్ లీకేజీ వలననే తమకు అవస్థ కలిగి హాస్పిటల్ పాలయ్యామని విద్యార్థులు చెబుతున్నారు. అయితే చెత్తకుండి నుంచి వెలువడిన దుర్గంధం వలననే ఈ ఘటన జరిగిందని యాజమాన్యం తెలపడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పట్ల యాజమాన్యం కనీస బాధ్యత నిర్వర్తించలేదని నిరసనకు దిగారు. ఇప్పుడు ఇంకా ముగ్గురు విద్యార్గులు నిమ్స్ హాస్పిటల్‌లో చావు బ్రతుకులు మధ్య కొట్టుమిట్టాడుతున్నారని వెల్లడించారు. బాధితుల హార్ట్‌లో నీరు చేరిందని వైద్యులు ధృవీకరించారని విద్యార్థులు తెలిపారు. కాలేజీలో జరిగిన తప్పు వలన తాము తమ కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి వచ్చిన తరువాత మళ్ళీ అస్వస్థతకు గురవ్వడం మళ్ళీ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడం పరిపాటిగా మారిందని చెప్పారు. కాలేజి సిబ్బందికి తల్లిదండ్రులకు మధ్య వాగ్వివాదం జరుతుండగానే మరో ముగ్గురు విద్యార్థులు స్పృహ తప్పిపడిపోయారు. దీంతో వెంటనే వారిని గీత హాస్పిటల్‌కు తరలించారు.

Updated Date - 2022-12-27T14:40:35+05:30 IST