విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , First Publish Date - 2022-11-06T22:40:19+05:30 IST
చంగుడి గ్రామానికి చెం దిన బమ్మిడి జోగారావు(34) అనే రైతు ఆదివారం విద్యుదా ఘాతానికి గురై మృతి చెందాడు.
పాతపట్నం, నవంబరు 6: చంగుడి గ్రామానికి చెం దిన బమ్మిడి జోగారావు(34) అనే రైతు ఆదివారం విద్యుదా ఘాతానికి గురై మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జోగారావుకు చెం దిన పొలంలో వ్యవసాయ మోటార్ ఫ్యూజ్ ఎగిరిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జోగారావు మరమ్మతులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెం దాడు. ఆయనకు భార్య నిర్మల, ఏడాదిన్నర కుమారుడు, మూడు నెలల బాబు ఉన్నారు. నిర్మల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎన్.కామేశ్వరరావు, ట్రాన్స్‌కో ఏఈ రమేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని సీహెచ్‌సీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనుమానాస్పదస్థితిలో వృద్ధుడు..
నరసన్నపేట, నవంబరు 6: చోడవరం పంచాయ తీ సోమవారంపేటకు చెందిన మొండి చిన్నయ్య (80) అనే వృద్ధుడు మెయ్యివానిపేట వద్ద సాగునీటి కాలువలో అను మానాస్పదస్థితిలో మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. చిన్నయ్య ఈనెల ఒకటో తేదీ నుంచి కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికినా జాడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆది వారం గ్రామ సమీపంలోని మెయ్యివానిపేట వద్ద సాగునీ టి కాలువలో చిన్నయ్య మృతదేహం లభ్యమైంది. కుమారుడు రాజు సమాచా రంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.
దక్షిణాఫ్రికాలో పీర్‌సాహెబ్‌పేట వాసి..
ఆమదాలవలస రూరల్: కలివరం పంచాయతీ పీర్‌సాహెబ్‌పేటకు చెందిన కూన కుశరావు అలియాస్ లక్ష్మణ్ దక్షిణాఫ్రికాలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు... ఓ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేసేందుకు నెల రోజుల కిందట కుశరావు దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అక్కడ అనారోగ్యానికి గురికావడంతో తోటి డ్రైవర్లు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించ డంతో మృతి చెందాడు. ఉపాధి కోసం వలస వెళ్లిన నెల రోజులకే కుశరావు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. గ్రామం లో విషాదచాయలు అలముకున్నాయి. కాగా, కుశరావు మృతదేహాన్ని తీసుకురావ డానికి రూ.15 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి యాజమాన్యం, కంపెనీ నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్వస్థలానికి మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.