‘మా పిల్లల బాధ్యత మీదే’

ABN , First Publish Date - 2022-12-10T23:36:46+05:30 IST

ఉపాధ్యాయుల సూచనల మేరకు ప్రభుత్వ పాఠ శాలలో మా పిల్లల్ని చేర్పించాం.. వారి బాధ్యత మీపైనే ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు.

‘మా పిల్లల బాధ్యత మీదే’

పోలాకి: ఉపాధ్యాయుల సూచనల మేరకు ప్రభుత్వ పాఠ శాలలో మా పిల్లల్ని చేర్పించాం.. వారి బాధ్యత మీపైనే ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. శనివారం ఈదులవలస మోడల్‌ స్కూల్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ పైడి ప్రవీణ మా ట్లాడుతూ.. పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక పిల్లలను చదివించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని సూచించారు. టీవీలను, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా విద్యా ర్థులు సాధించిన మార్కులను చదివి వినిపించారు. కార్యక్రమంలో ఉపాఽధ్యా యులు, విద్యా కమిటీ చైర్మన్‌ బొంగు జగన్నాఽథం, పీడీ ఎం.నీలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T23:36:47+05:30 IST