TDP: పసుపు సైనికుడు లచ్చనయ్య.. నిత్యం టీడీపీ ప్రచారకుడిగా
ABN , First Publish Date - 2022-12-21T19:01:32+05:30 IST
ఏడు పదుల వయసు ఉన్న ఈయన పేరు బి.లచ్చనయ్య. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం వసుంధర స్వగ్రామం. టీడీపీ (TDP) వీరాభిమాని. పార్టీ ఆవిర్భావం నుంచి గెలుపోటములతో సంబంధం లేకుండా పనిచేస్తున్నాడు.
శ్రీకాకుళం: ఏడు పదుల వయసు ఉన్న ఈయన పేరు బి.లచ్చనయ్య. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం వసుంధర స్వగ్రామం. టీడీపీ (TDP) వీరాభిమాని. పార్టీ ఆవిర్భావం నుంచి గెలుపోటములతో సంబంధం లేకుండా పనిచేస్తున్నాడు. పసుపు రంగు అంటే వల్లమానిన అభిమానం. నిత్యం పసుపు రంగు దుస్తులనే ధరిస్తాడు. సైకిల్ (Cycle)కు కూడా పసుపురంగు పూసి పార్టీ విధానాలను ప్రచారం చేయడం ఆయన రోజువారి విధుల్లో భాగం. లచ్చనయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలిద్దరికీ వివాహాలు జరగడంతో వారు వేరే ప్రాంతంలో ఉపాధి పొందుతున్నారు. తనుకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేయడం.. మిగతా సమయాల్లో ‘సైకిల్’నే ప్రచార రథంగా చేసుకొని ఊరూవాడ ప్రచారం చేస్తుంటాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు, హోదా అనుభవించిన నాయకులు అధికార వైసీపీ దూకుడుకు భయపడుతున్నారు. అటువంటిది ఇది ఎన్టీఆర్ (NTR) స్థాపించిన పార్టీ.. మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని బలమైన ఆకాంక్షతో లచ్చన్నయ్య పనిచేస్తున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేస్తున్నాడు. సుశిక్షితుడైన టీడీపీ కార్యకర్తకు నిలువుటద్ధంలా నిలుస్తున్నాడు లచ్చనయ్య.