స్టోన్‌ ప్లాంటేషన్‌ పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-11-05T23:42:38+05:30 IST

జిల్లాలో స్టోన్‌ ప్లాంటేషన్‌ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశించారు.

స్టోన్‌ ప్లాంటేషన్‌ పనులు పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌

కలెక్టరేట్‌: జిల్లాలో స్టోన్‌ ప్లాంటేషన్‌ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశించారు. శనివారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 30 మండలాలకు సంబంధించి 171 గ్రామాలకు సరిహద్దు రాళ్లు పూర్తి స్థాయిలో అందజేశామన్నా రు. ఇప్పటి వరకు కేవలం నాలుగు గ్రామాల్లోనే స్టోన్‌ ప్లాంటేషన్‌ ప్రక్రియ శతశాతం పూర్తయ్యిందన్నారు. మిగతా గ్రామాల్లో బుధవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్వే భూ రికార్డులు సహాయ సంచాలకుడు కె.ప్రభాకరరావు,డ్వామా పీడీ జీవీ చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-05T23:42:40+05:30 IST