తేలుకుంచిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
ABN , First Publish Date - 2022-12-05T23:46:21+05:30 IST
తేలుకుంచి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అటవీశాఖ రాష్ట్ర అడిషినల్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ శాంతి ప్రియా పాండే తెలిపారు.
ఇచ్ఛాపురం రూరల్: తేలుకుంచి గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అటవీశాఖ రాష్ట్ర అడిషినల్ ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వేటర్ శాంతి ప్రియా పాండే తెలిపారు. సోమవారం తేలుకుంచిలోని పక్షుల విడిది కేంద్రాన్ని, చెట్లపై ఉన్న పక్షులను సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ జిల్లాలోని తేలుకుంచికి 3500, తేలినీలాపురంలో 2500 వరకు ఈ సీజన్‌లో సైబీరియన్ పక్షులు వస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి నిషాకుమారి, టెక్కలి అసిస్టెంట్ కన్సర్వేటర్ వి.హారిక, కాశీబుగ్గ డిప్యూటీ రేంజ్ అధికారి ఎ.మురళీకృష్ణ, మందస డీఆర్వో ఐ.రాము, బీట్ అధికారులు పాల్గొన్నారు.