విదేశీ విహంగాల సందడి

ABN , First Publish Date - 2022-12-04T23:33:19+05:30 IST

బూరవెల్లిలో విదేశీ విహంగాలు సందడి చేస్తున్నాయి. ప్రతి ఏటా శీతాకాలంలో ఈ పక్షులు సైబీరియా నుంచి బయలుదేరి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ గ్రామం చేరుకుంటాయి.

 విదేశీ విహంగాల సందడి



గార: బూరవెల్లిలో విదేశీ విహంగాలు సందడి చేస్తున్నాయి. ప్రతి ఏటా శీతాకాలంలో ఈ పక్షులు సైబీరియా నుంచి బయలుదేరి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ గ్రామం చేరుకుంటాయి. చింతచెట్లమీద గూడులు కట్టుకొని అందులో సుమారు 5 నెలలు ఉంటాయి. ఈ సమయంలో పిల్లలను కని వాటిని కొంత వరకు పెంచి అవి పెద్దవి అయ్యాక తిరిగి సైబీరియా వెళ్లిపోతాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్నన్నాళ్లు గ్రామం పక్కనే ఉన్న వంశధార నదిలో చేపలను ఆహారంగా తీసుకుంటాయని తెలిపారు. గ్రామానికి కొద్దికొద్దిగా చేరుకుంటున్న ఈ విహంగాలు ఉదయం, సాయంత్రం వేళల్లో అటూ ఇటూ తిరుగుతూ గ్రామంలో సందడి చేస్తోన్నాయి. 

 

  

Updated Date - 2022-12-04T23:33:20+05:30 IST