వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంలో కీలక పరిణామం

ABN , First Publish Date - 2022-11-28T16:59:33+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంలో కీలక పరిణామం

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై సుప్రీంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తు మరో రాష్ట్రానికి బదిలీపై ఒకటి, రెండు రోజుల్లో తీర్పు వెలువడనుంది. తన తండ్రి హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ... వైఎస్ సునీత పిటిషన్‌పై జస్టిస్‌ ఎం.ఆర్ షా తీర్పు ఇవ్వనున్నారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది. వివేకా హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీపై తీర్పు వచ్చిన తర్వాత నిందితుడు గంగిరెడ్డి బెయిల్‌పై విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది.

Updated Date - 2022-11-28T16:59:35+05:30 IST