Home » ys viveka murder case
Adinarayana Reddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్, అవినాష్ రెడ్డిలకు వివేకా హత్య కేసులో ప్రమేయం లేదా అని ప్రశ్నించారు. ముందు వివేకా హత్య కేసులో వారిద్దరూ ముద్దాయిలు కాదని తేల్చండి అని ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అందులో కీలక విషయాలను వెల్లడించింది.
Pawan Kumar Investigation: ఎంపీ అవినాష్ అనుచరుడు పవన్ కుమారుడు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. వైఎస్ వివేకా కేసులో నిందితుడు సునీల్ ఇచ్చిన ఫిర్యాదుతో పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Viveka Case Update: వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంలో రాంసింగ్, సునీత, నర్రెడ్డిలపై వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన కేసులో అదనపు డాక్యుమెంట్లను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్లో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం సాయంత్రం విజయవాడ రాజ్ భవన్‌కు వెళ్లిన సునీత.. తన తండ్రి హత్యకేసుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
Justice for Viveka: వైఎస్ వివేకను హత్య చేసి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వివేకా కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో 2019 మార్చి 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా కలిగించింది. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న మృతిచెందారు.అయితే రంగన్న మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య తెలిపింది.
Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పీఏ కృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన పెట్టిన కేసును తప్పుడు కేసుగా తేల్చేశారు పులివెందుల పోలీసులు. అలాగే కృష్ణారెడ్డి నోటీసులు కూడా జారీ చేశారు.
వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ హత్య చేసిందేవరో కోర్టు తుది తీర్పు తర్వాతనే తేలనుంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. దాదాపు హత్య జరిగి ఐదేళ్లు గడిచినా ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. ఈ హత్య చేసిందేవరో కోర్టు తుది తీర్పు తర్వాతనే తేలనుంది. సీబీఐ సుదీర్ఘకాలంగా కేసును విచారిస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఈ కేసు విచారణలో స్పీడ్ తగ్గింది.