Koppula Eashwar: నిజాలు చెప్పేందుకే బీఆర్ఎస్ పుట్టింది

ABN , First Publish Date - 2022-12-16T12:02:58+05:30 IST

బీఆర్ఎస్‌ను చూస్తే.. బీజేపీకి చెమటలు పడుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలు చేశారు.

Koppula Eashwar: నిజాలు చెప్పేందుకే బీఆర్ఎస్ పుట్టింది

కరీంనగర్: బీఆర్ఎస్‌ (BRS)ను చూస్తే.. బీజేపీ (BJP)కి చెమటలు పడుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ (Telangana Minister Koppula Eashwar) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ ఆషామాషీగా పెట్టింది కాదన్నారు. దేశంలో కాంగ్రెస్ డీలా పడిందని తెలిపారు. వేరే దిక్కులేకే.. ఇన్నాళ్లూ బీజేపీకి జనం ఓట్లేశారని అన్నారు. పాకిస్తాన్, చైనా బార్డర్ల పేరు చెప్పుకుని బీజేపీ బతుకుతోందని విమర్శించారు. బీజేపీవి అన్నీ అబద్దాలే అని... నిజాలు చెప్పేందుకే బీఆర్ఎస్ పుట్టిందని చెప్పుకొచ్చారు. నడ్డా (JP Nadda)కు, బండి సంజయ్‌ (Bandi Sanjay)కి అసలు సిగ్గుందా అని మంత్రి కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు.

Updated Date - 2022-12-16T12:02:59+05:30 IST