Minister Botsa: ఉత్తరాంధ్ర ప్రయోజనాలే ముఖ్యం
ABN , First Publish Date - 2022-11-12T19:56:53+05:30 IST
Vishakapatnam: ఉత్తరాంధ్ర ప్రయోజనాలు తమకు ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) పేర్కొన్నారు. టీడీపీ(TDP) నుంచి బీజేపీ(BJP)లోకి వెళ్లిన వారు తమపై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు.
Vishakapatnam: ఉత్తరాంధ్ర ప్రయోజనాలు తమకు ముఖ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) పేర్కొన్నారు. టీడీపీ(TDP) నుంచి బీజేపీ(BJP)లోకి వెళ్లిన వారు తమపై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. ఏపీకి మంచి రోజులు వస్తాయన్న పవన్ వ్యాఖ్యలపై ఆ విషయాన్ని ఆయన్నే అడగాలని మీడియా సమాధానమిచ్చారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఉత్తరాంధ్రకు రావడం సంతోషకరమన్నారు. ప్రధాని సభకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం, పార్టీ ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి జగన్ స్పష్టంగా, క్లుప్తంగా వివరించారని పేర్కొన్నారు. ‘‘ఋషికొండకు చూడడానికి ఒక నాయకుడు, సెలబ్రెటీ వెళ్ళాడు. బయట నుంచి ఎవరైనా చూడవచ్చు. అందుకే పవన్ వెళ్ళి ఉంటారు. బుషికొండపై ప్రభుత్వం భవనాలు కడుతున్నాం. అందులో తప్పేముంది. ఋషికొండను ఏమైనా ప్రైవేట్ వ్యక్తుల ఇచ్చామా? అని బొత్స ప్రశ్నించారు.