Home » Botsa Satyanarayana
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైసీపీ మొట్టమొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై 13 నుంచి వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ డిస్కమ్‌లకు ఉన్న రూ.15,485 కోట్ల ట్రూ అప్ చార్జీల బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహారశైలిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్ట్‌లో బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరుపై బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు.
విశాఖ శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం భూముల కేటాయింపు అంశంపై మంగళవారం శాసన మండలిలో వాడీవేడిగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నుంచి సోమవారం వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేయడం పట్ల రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసహనం వ్యక్తం చేశారు. వారు సంధించిన ప్రశ్నలకు తాము సమాధానం ఇచ్చేందుకు సిద్దమని చెప్పిన.. వైసీపీ సభ్యులు వెళ్లిపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు.
2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇదే లులు గ్రూప్ విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్నారు. కానీ ఆ ప్రభుత్వ వైఖరితో లులు గ్రూప్ తమిళనాడు, తెలంగాణకు తరలిపోయింది.
Andhrapradesh: చంద్రబాబు చేసిన తప్పులకు ప్రజలకు శిక్ష వేయవోద్దని భగవంతుడిని ప్రార్ధించామని బొత్స తెలిపారు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి ఉందని విమర్శించారు. శ్రీవారి లడ్డూపై భక్తులను గందరగోళంకు గురి చేశారని అన్నారు.
బొత్స సత్యనారాయణ ఏ పార్టీలో ఉన్నా ఆ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఉండేది. కుటుంబ సభ్యులకు అవసరమైన పదవులను దక్కించుకునేవారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం తన కుటుంబానికి ..
Andhrapradesh: వైసీపీ నేతలకు వరద బాధితుల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వైసీపీ నాయకులను వరద బాధితులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. విజయవాడ ఆర్ఆర్ పేటకు వెళ్లిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను వరద బాధితులు అడ్డుకున్నారు. ఒక్కసారిగా బొత్సకు తిరిగబడ్డారు వరద బాధితులు. వరదలు వచ్చిన నాలుగు రోజులకు పరామర్శకు వచ్చారా అంటూ నిలదీశారు.