Nadendla Manohar: ‘వారాహి’తో వైసీపీ నేతల్లో అలజడి
ABN , First Publish Date - 2022-12-12T21:28:26+05:30 IST
Anakapalli: జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికలకు సిద్ధమవుతున్నామని చెప్పగానే వైసీపీ నేతల్లో
Anakapalli: జనసేన(Janasena) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికలకు సిద్ధమవుతున్నామని చెప్పగానే వైసీపీ నేతల్లో అలజడి మొదలైందని పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ (YCP) మంత్రులకు పనిలేక, రైతులను ఆదుకోవడం చేతకాక 24 గంటలూ పవన్ వారాహి వాహనం గురించి మాట్లాడుతున్నారని, తమ పార్టీ ఏనాడూ చట్టాన్ని ఉల్లంఘించదని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేస్తే హైకోర్టు ఆదేశాల మేరకు రూ. 1000 కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి మళ్లీ రంగులు మార్చాల్సి వచ్చిందన్న విషయాన్ని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు.