తిరుమలలో అన్నమయ్య గృహాన్ని పునరుద్ధరించాలి
ABN , First Publish Date - 2022-10-17T05:56:46+05:30 IST
తిరుమలలో తాళ్లపాక అన్నమాచార్యుల గృహాన్ని పునరుద్ధరించే వరకు పోరాడుతామని అన్నమయ్య గృహ సాధన సమితి అధ్యక్షుడు విజయశంకర స్వామి స్పష్టం చేశారు.
అన్నమయ్య గృహ సాధన సమితి అధ్యక్షుడు విజయశంకర స్వామి
సింహాచలం : తిరుమలలో తాళ్లపాక అన్నమాచార్యుల గృహాన్ని పునరుద్ధరించే వరకు పోరాడుతామని అన్నమయ్య గృహ సాధన సమితి అధ్యక్షుడు విజయశంకర స్వామి స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సంతకాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. సమితి ప్రతినిధులతో కలిసి ఆదివారం సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని తమ అభీష్టాన్ని నెరవేర్చాలని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటి వరకు 11.5 లక్షల సంతకాలు సేకరించినట్లు తెలిపారు. సింహగిరిపై కూడా పలువురు భక్తులు సంతకాలు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట సాధన సమితి కార్యదర్శి దున్న లక్ష్మేశ్వర్, ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి యం. త్రిమూర్తులు, లోక్‌నాథ్, జి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.