ఉద్యానవన పంటల సేకరణ కేంద్రాలకు రాయితీ

ABN , First Publish Date - 2022-11-13T00:54:45+05:30 IST

ఉద్యానవన పంటల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తుందని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి జి.ప్రభాకరరావు తెలిపారు.

ఉద్యానవన పంటల సేకరణ కేంద్రాలకు రాయితీ
ఉద్యానవన తోటలను పరిశీలిస్తున్న డీహెచ్‌వో

కె.కోటపాడు, నవంబరు 12: ఉద్యానవన పంటల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న రైతు ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తుందని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి జి.ప్రభాకరరావు తెలిపారు. శనివారం మండలంలోని వారాడ, ఏ.కోడూరు, ఆర్లి, కింతాడ, కె.సంతపాలెంల్లోని రైతులు పండిస్తున్న ఉద్యానవనాలు, రైతు భరోసా కేంద్రాలను ఆయన సందర్శించారు. ఆర్‌బీకేల్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభాకరరావు విలేకరులతో మాట్లాడుతూ.. కూరగాయలు, మామిడి, తదితర పంటలను గ్రేడింగ్‌, ప్యాకింగ్‌ చేసే కలెక్షన్‌ సెంటర్లకు ప్రభుత్వం రూ.15 లక్షలు మంజూరు చేస్తుందన్నారు. అందులో 75 శాతం రాయితీగా అందిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో కూడా ఈ సంఘాలు కలెక్షన్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకోవచ్చనన్నారు. ఆయన వెంట ఉద్యానవన అధికారిణి కిరణ్మయి, ఉద్యాన సహాయకులు సేవిత (కె.సంతపాలెం), కుమార్‌ (కింతాడ), అనూష (పిండ్రంగి), సుధీర్‌ (గొండుపాలెం), సౌజన్య (ఆర్లి) తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-13T00:54:48+05:30 IST