జల వనరుల సంరక్షణపై దృష్టిసారించండి

ABN , First Publish Date - 2022-07-14T06:30:01+05:30 IST

చెరువులను అభివృద్ధి చేసి జల వనరులను సంరక్షించేలా అధికారులు దృష్టిసారించాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.

జల వనరుల సంరక్షణపై దృష్టిసారించండి
అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ


ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ


పాడేరు, జూలై 13 (ఆంధ్రజ్యోతి): చెరువులను అభివృద్ధి చేసి జల వనరులను సంరక్షించేలా అధికారులు దృష్టిసారించాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయం నుంచి ఏజెన్సీలోని ఎంపీడీవోలు, ఉపాధి హామీ అధికారులు, రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్‌, గిరిజన సంక్షేమ, డ్వామా అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మిషన్‌ అమృత్‌ సరోవర్‌ పథకంలో మంజూరు చేసిన పనులను ప్రారంభించాలన్నారు. అలాగే ప్రతి మండలంలో 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్లకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ చేయాలన్నారు. జామిగుడ రోడ్డు పనులపై ఆరా తీశారు. మనబడి నాడు-నేడు పనులు, ఏకలవ్య పాఠశాలల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ రమేశ్‌రామన్‌, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం.రాజు, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ కె.లావణ్యకుమార్‌, ఉపాధి హామీ పథకం ఏపీడీ జె.గిరిబాబు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-14T06:30:01+05:30 IST