Pranav Gopal: యువతకు ఉద్యోగాలు రావాలంటే జగన్ వెంటనే దిగిపోవాలి..
ABN , First Publish Date - 2022-12-31T14:42:40+05:30 IST
విశాఖ: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ (YCP Govt.) విధానాల వల్ల యువత నిర్వీర్యం అయిపోయిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (Pranav Gopal) వ్యాఖ్యానించారు.
విశాఖ: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ (YCP Govt.) విధానాల వల్ల యువత నిర్వీర్యం అయిపోయిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ (Pranav Gopal) వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నిరాశతో బతుకుతున్న యువతకు భరోసా కల్పించేందుకే ‘యువగళం’ పేరిట నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర చేయనున్నారని అన్నారు. రెండు లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి.. యువతను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని విమర్శించారు. ఉద్యోగాలు రాకపోవడంతో మనస్థాపం చెందిన చాలామంది యువత ఆత్మహత్యలు (Suicide) చేసుకున్నారన్నారు. యువగళం పేరుతో జనవరి 27 నుంచి మొదలవుతున్న పాదయాత్రలో వేలాదిగా యువత పాల్గొనాలని పిలుపునిస్తున్నామని.. యువతకు ఉద్యోగాలు రావాలంటే జగన్ (Jagan) వెంటనే దిగిపోవాలని ప్రణవ్ గోపాల్ అన్నారు.