ఎన్‌ఏడీ కూడలి వద్ద స్తంభించిన ట్రాఫిక్
ABN , First Publish Date - 2022-10-16T06:07:37+05:30 IST
జన సేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ రాక సందర్భంగా ఎన్‌ఏడీ ప్లైవోవర్ నాయకులు అభిమానులతో కిక్కిరిసిపోయింది.
ఎన్‌ఏడీ జంక్షన్ అక్టోబరు 15: జన సేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ రాక సందర్భంగా ఎన్‌ఏడీ ప్లైవోవర్ నాయకులు అభిమానులతో కిక్కిరిసిపోయింది. సుమారు 6.20 నిమిషాలకు విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో ఇక్కడకు చేరుకుని అంద రికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. పవన్‌కల్యాణ్ రాక సందర్భంగా సాయంత్రం 5.20 నిమిషాల నుంచే ప్లైవోవర్‌పై రాకపోకలను నిలిపివేశారు.అయితే ఆయన ఆలస్యంగా ఇక్కడకు చేరుకోవడంతో ప్లైవోవర్ మార్గాలతో పాటు దిగువన కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సుమారు రెండు గంటలపాటు బస్సులు, కార్లు తదితర వాహనాల్లో వున్న ప్రయాణికులు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు.