బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో బందోబస్తు

ABN , First Publish Date - 2022-11-29T23:54:37+05:30 IST

ఓబీసీలకు 52 శాతం రిజర్వేషన్‌ను జనా భా ప్రాతిపదికన కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ర్టీయ పిచడా వర్గ్‌ మోర్చా (ఆర్‌పీవీ ఎం), బహుజన్‌ ముక్తిపార్టీ (బీఎంపీ)లు సంయుక్తంగా 12 గంటల భారత్‌బంద్‌కు పిలుపుఇచ్చిన నేపథ్యంలో మంగళవారం బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో పోలీసులు బందో బస్తు నిర్వహించారు.

బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో బందోబస్తు
రైల్వేస్టేషన్‌లో బందోబస్తు నిర్వహిస్తున్న ఆర్‌పీఎఫ్‌ సీఐ సిబ్బంది:

బొబ్బిలి: ఓబీసీలకు 52 శాతం రిజర్వేషన్‌ను జనా భా ప్రాతిపదికన కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ర్టీయ పిచడా వర్గ్‌ మోర్చా (ఆర్‌పీవీ ఎం), బహుజన్‌ ముక్తిపార్టీ (బీఎంపీ)లు సంయుక్తంగా 12 గంటల భారత్‌బంద్‌కు పిలుపుఇచ్చిన నేపథ్యంలో మంగళవారం బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో పోలీసులు బందో బస్తు నిర్వహించారు. బంద్‌ పిలుపు నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ముందస్తు బందోబస్తు నిర్వహించినట్లు ఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టరు రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇక్కడ బంద్‌ ప్రభావం లేకపోయినా ఏదైనా ఆందోళన జరగకుండా ఉండేందుకు తమ సిబ్బం దితో అప్రమత్తమైనట్లు చెప్పారు.

Updated Date - 2022-11-29T23:54:39+05:30 IST