పోలి పాడ్యమికి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-11-23T00:22:50+05:30 IST

పోలి పాడ్యమిని పురస్కరించుకుని తోటపల్లి నాగావళి నదీ ప్రాంతానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని పాలకొండ డీఎస్పీ జీవీ కృష్ణారావు సూచించారు.

  పోలి పాడ్యమికి ఏర్పాట్లు
ఆలయ ప్రాంగణంలో సిబ్బందితో మాట్లాడుతున్న డీఎస్పీ

గరుగుబిల్లి, నవంబరు 22 : పోలి పాడ్యమిని పురస్కరించుకుని తోటపల్లి నాగావళి నదీ ప్రాంతానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని పాలకొండ డీఎస్పీ జీవీ కృష్ణారావు సూచించారు. మంగళవారం తోటపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం, నదీ తీర ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ నెల 24న జరగనున్న పోలి పాడ్యమి ఏర్పాట్లపై ఆలయ సిబ్బంది మార్కొండ మురళీనాయుడును అడిగి తెలుసుకున్నారు. నదీ హారతులు ఇచ్చేందుకు పెద్దఎత్తున భక్తుల రానున్న దృష్ట్యా నాగావళి ఒడ్డుకు ఆనుకుని ఉన్న స్థలాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్‌ అలంకరణతో పాటు ప్రమాదాలు నెలకొనకుండా ఉండేలా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా అగ్నిమాపక, పోలీస్‌, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ఎస్‌ఐ రాజేష్‌ను డీఎస్పీ ఆదేశిం చారు. ఈ పరి శీలనలో తోటపల్లి ఈవో బి.లక్ష్మీనగేష్‌, ఎంపీటీసీ సభ్యుడు ఎం.సింహాచలంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:23:08+05:30 IST