మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ABN , First Publish Date - 2022-12-17T23:50:40+05:30 IST
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించ నుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నెల్లిమర్ల: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించ నుందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సెంచూరియన్ యూనివర్సిటీలో శనివారం నిర్వహించిన ద్వితీయ స్నాతకోత్సవంలో ఆయన వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని చెప్పారు. దేశంలోనే నైపణ్య విద్యను అందించ డంలో సెంచూరియన్ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సెంచూరియన్ చాన్సలర్ డా.దేవీప్రసన్న పట్నాయక్ మాట్లాడు తూ భారత్‌లోని ఆర్థిక అసమానతలు 5జీ టెక్నాలజీ రాకతో తగ్గుముఖం పట్టవచ్చ న్నారు. ప్రపంచ స్థాయి నైపుణ్య విద్యను విద్యార్థులకు అందించేందుకు తాము కృషి చేస్తున్నామని సెంచూరియన్ వీసీ జీఎస్‌ఎన్ రాజు తెలిపారు. వచ్చే ఏడాది ఎంబీఏ కోర్సులు ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. గౌరవ అతిథిగా పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి ముదే సేవల నాయక్ మాట్లాడుతూ 2030 నాటికి భారత్ ఆర్థిక రంగం విస్తరించుకోనుందన్నారు. వివిధ విభాగాలలో ప్రతిభ చూసిన పదిమంది విద్యార్థులకు పది బంగారు పతకాలను అందజేశారు. దీంతోపాటు ప్రోత్సాహక బహు మతి కింద ఒక విద్యార్థికి రూ.10వేలు అందజేశారు. అనంతరం 149మంది విద్యా ర్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షుడు డా.ముక్తికాంత్ మిశ్రా, ఉపాధ్యక్షుడు డీఎన్ రావు, ఒడిశా క్యాంపస్ వైస్ చాన్సలర్ డా.సుప్రియా పట్నాయక్, రిజిస్ర్టార్ డా.ఆర్‌ఎస్ వర్మ, గవర్నర్ బాడీ సభ్యులు, ప్రొఫెసర్ పద్మరాజు, ప్రొఫెసర్ మల్లికార్జున, డీన్లు డా.సన్నిడియోల్, డా.ఎంఎల్‌ఎన్ ఆచార్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.