విజయనగరంలో సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌

ABN , First Publish Date - 2022-12-03T00:21:28+05:30 IST

సినీ తారల సందడి నడుమ శుక్రవారం విజయనగరంలో సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రారంభ మైంది. 28వ మాల్‌గా యాజమాన్యం ప్రారంభించింది.

విజయనగరంలో సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌

విజయనగరం (ఆంధ్రజ్యోతి), డిసెంబరు 2 : సినీ తారల సందడి నడుమ శుక్రవారం విజయనగరంలో సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రారంభ మైంది. 28వ మాల్‌గా యాజమాన్యం ప్రారంభించింది. సినిమా తారలు రాశీఖ న్నా, పాయల్‌ రాజ్‌పూత్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వేలాది మంది అభి మానులు తరలిరావడంతో మాల్‌ ప్రాంగణంలో కిక్కిరిసింది. మొత్తం నాలుగు ఫ్లోర్లలో ఏర్పాటుచేసిన ఈ మాల్‌ను వస్త్రశ్రేణితో పాటు జ్యూయలరీ విభాగాన్ని సై తం అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభోత్సవం అనంతరం మాల్‌ను తిలకించిన తారలు చీరలు, నగలు ధరించి మురిసిపోయారు. వాటితో ఫొటోలకు ఫోజులి చ్చారు. ప్రారంభోత్సవానికి మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జడ్పీ చైర్మన్‌ చిన్నశ్రీను, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, చాంబర్‌ అఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు, 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ కె.సీతారామమూర్తి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ డైరెక్టర్లు సునీల్‌ సీర్న, అభినయ్‌, రాకేశ్‌, కేశవ్‌ విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో, అన్నివ ర్గాల వారికి అనుగుణంగా వస్త్రా శ్రేణితో పాటు బంగారు ఆభరణాలను విక్రయించ నున్నట్టు తెలిపారు. నాణ్యతకు, నమ్మకానికి పెద్దపీట వేసినట్టు చెప్పారు. విజయన గరంలో 28వ బ్రాంచ్‌ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా ప్రజలు ఆశీర్వదించి.. ఆదరించాలని కోరారు. కాగా తొలిరోజు కొనుగోళ్లకు ప్రజలు ఎగబ డ్డారు. దీంతో మాల్‌ జనాలతో కిటకిటలాడుతూ కనిపించింది.

Updated Date - 2022-12-03T00:21:31+05:30 IST