క్రీడల నిర్వహణతో ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు

ABN , First Publish Date - 2022-11-02T23:52:30+05:30 IST

క్రీడల నిర్వహణ ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి లభించడం ఖాయమని, షార్జా, సియోల్‌ వంటి నగరాలకు ప్రపంచ స్థాయి లో గుర్తింపురావడానికి అదే కారణమని విశాఖ ఎమ్మెల్యే, రాష్ట్ర వాలీబాల్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు పీజీవీఆర్‌ నాయుడు(గనబాబు) అన్నారు.

 క్రీడల నిర్వహణతో ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు

బొబ్బిలి, నవంబరు 2: క్రీడల నిర్వహణ ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి లభించడం ఖాయమని, షార్జా, సియోల్‌ వంటి నగరాలకు ప్రపంచ స్థాయి లో గుర్తింపురావడానికి అదే కారణమని విశాఖ ఎమ్మెల్యే, రాష్ట్ర వాలీబాల్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు పీజీవీఆర్‌ నాయుడు(గనబాబు) అన్నారు. స్థానిక రాజాకళాశాల మైదానంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు(బేబీనాయన) సౌజన్యంతో బుధవారం సాయంత్రం 8వ రాష్ట్రస్థాయి జూనియర్‌ వాలీబాల్‌ చాంపి యన్‌ షిప్‌ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన గన్నబాబు మాట్లాడుతూ బొబ్బిలి రాజవంశీయుల సౌజన్యంతో క్రీడా నిర్వ హణకు విశేషమైన గుర్తింపు లభిస్తూ వస్తోందని, ఒరిజినల్‌ బంగారంతో క్రీడాప తకాలు ఇచ్చిన ఘనత బొబ్బిలి రాజులకు దక్కుతుందన్నారు. ప్రాంతాలు ఆర్థికాభి వృద్ధి చెందేందుకు క్రీడలు దోహదపడతాయన్నారు. అన్ని రాజకీయపార్టీలకు చెందిన నాయకులను ఒకే వేదికమీదకి తెచ్చే శక్తి క్రీడలకు ఉందన్నారు. ఈ నెల 14 నుంచి 19 వరకు జమ్మూకాశ్మీర్‌లో జరగనున్న నేషనల్స్‌లో పాల్గొనే రాష్ట్రస్థాయి జట్టును బొబ్బిలిలోనే ఎంపిక చేసుకోబోతున్నట్లు ఆయన ప్రకటించారు. బేబీనాయన మాట్లా డుతూ విద్యతో నిత్యం కుస్తీలు పట్టే యువతకు క్రీడలు ఎంతో ఉపశమనం కలిగించ డమే కాక, అన్ని రకాల నైపుణ్యాలను కలిగిస్తుందన్నారు. బాలబాలికల విభాగంలో డే అండ్‌ నైట్‌ పోటీలను నిర్వహించనున్నామని, 13 జిల్లాల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషదాయకమన్నారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు రాంబార్కి శరత్‌బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత క్రీడాజ్యోతితో ర్యాలీ, క్రీడాకారుల గౌరవవందనం నిర్వహించారు. మునిసిపల్‌ చైర్మన్‌ సావు వెంకట ముర ళీకృష్ణారావు, సీనియర్‌ నేతలు, విఐపీలు శంబంగి వేణుగోపాలనాయుడు, జడ్పీటీసీ సంకిలి శాంతకుమారి, రౌతు రామ్మూర్తి, పువ్వల శ్రీనివాసరావు, డాక్టర్‌ కేవీ అప్పా రావు, నంబియార్‌ వేణుగోపాలరావు, అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి భగవాన్‌ దాస్‌, గెంబలి శ్రీనివాసరావు, సుంకరి సాయిరమేష్‌, గంటి శర్మ, కోచ్‌లు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నేత నల్ల వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.

బీబీఎల్‌3: క్రీడలను ప్రారంభిస్తున్న బేబీనాయన

Updated Date - 2022-11-02T23:59:27+05:30 IST