Home » Vizianagaram
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు గెలుపొందాారు. పార్లమెంట్ సమావేశాలకు ఆయన సైకిల్పై వెళ్తున్నారు.
బ్రిటిష్ కాలంనాటి విమానాశ్రయానికి పూర్వ వైభవం రాబోతోంది. విజయనగరం జిల్లాలోని బాడంగిలో బ్రిటిష్ కాలం నాటి చిన్న విమానాశ్రయం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రక్షణ అవసరాలకు వినియోగించేవారు. తర్వాత అది నిరుపయోగమైంది. అయితే ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తే దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడనుంది. అందు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.
పార్వతీపురం మండలం, నర్సిపురం సమీపంలో కొబ్బరి తోటను ఏనుగుల గుంపు పుర్తిగా ధ్వంసం చేసింది. దాదాపు రెండు వందల కొబ్బరి చెట్లను పుర్తిగా లాగి విసిరేసాయి. ఏనుగుల సంచారంతో సమీపంలో ఉన్న పంట పొలాలు ధ్వంసమయ్యాయి.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ(శనివారం) షెడ్యూల్ విడుదల అయింది ఈరోజు నుంచి విజయనగరం జిల్లాలో ఎన్నికల నియమావళి అమలు కానుంది. ఈ నెల 28వ తేదీన విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
జగన్ మీడియా సమావేశంలో గందరగోళం.. దీంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రెస్మీట్లో మీడియాతో మాట్లాడాలా.. వద్దా... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, పోలీసులపై మండిపడ్డారు. తనకు తానే ప్రతిపక్ష హోదా ఇచ్చుకున్న జగన్.. లేని ప్రతిపక్ష నేత హోదాను ఉన్నట్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జగన్ తీరుపై స్థానికులు మండిపడ్డారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్ల వెళ్లి డయేరియా బాధితులను పరామర్శించనున్నారు. జగన్ రాక నేపథ్యంలో వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయనగరం జిల్లాలోని గుర్లలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. డయేరియా వల్ల 10 మంది మృత్యువాత పడ్డారని గ్రామస్తులు తెలిపారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గుర్ల ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఒక్కొక్క మృతుని కుటుంబానికి తాను వ్యక్తిగతంగా రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
గొర్లలో డయేరియాతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) ఏపీ సచివాలయంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ అసిస్టెంట్స్కు వేతనాలు ఇవ్వలేదని.. గతంలో వైసీపీ చేసిన బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నెపం నెట్టుతారా.. అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ప్రజలు భయాందోళన చెందేలా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయనగరం పైడితల్లి అమ్మవారి తొలేళ్ల తంతు పూర్తయింది.. అశేష జనవాహిని అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించే సిరిమాను సంబరాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం 3 గంటలకు సిరిమాను బయలుదేరనుంది. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. అమ్మవారి పరివారంగా పిలిచే జాలరి వల, అంజలి రథం, పాలధార రథాలు సిరిమాను వెంట నడుస్తాయి.