Ayyanna Patrudu: చివరికి అండర్ వేర్ కంపెనీ కూడా పోయింది..
ABN , First Publish Date - 2022-12-21T15:36:34+05:30 IST
ప్రభుత్వం డబ్బుతో పుట్టిన రోజు జరుపుకోవటానికి సిగ్గుగా లేదా? జగన్ రెడ్డి (CM Jagan) అంటూ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ప్రశ్నించారు.
విజయనగరం: ప్రభుత్వం డబ్బుతో పుట్టిన రోజు జరుపుకోవటానికి సిగ్గుగా లేదా? జగన్ రెడ్డి (CM Jagan) అంటూ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ప్రశ్నించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో హార్డ్ వేర్ కంపెనీలు పోయాయని, చివరికి అండర్ వేర్ కంపెనీ కూడా పోయిందని విమర్శించారు. ఏ2 విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) అవినీతి నిరూపమైందన్నారు. మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు సిగ్గూ.. లజ్జా ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు మంత్రి ధర్మాన (Dharma) సిబిఐ దర్యాప్తు కోరాలన్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని జగన్ రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తారంటే తాము నమ్మాలా? అంటూ అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.