ఎలా బతికాం అనేదే ముఖ్యం

ABN , First Publish Date - 2022-11-10T00:23:46+05:30 IST

ఎంత సంపాదించాం అనేది కాదు.. ఎలా బతికాం అనేది ముఖ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సాయి కళ్యాణ్‌ చక్రవర్తి అన్నారు. చదువు తన కోసమే కాకుండా సమాజం, దేశం కోసం ఉపయోగపడాలన్నారు. న్యాయ సేవల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం సదస్సు జరిగింది.

ఎలా బతికాం అనేదే ముఖ్యం
మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్‌ చక్రవర్తి

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్‌ చక్రవర్తి

గంట్యాడ, నవంబరు 9: ఎంత సంపాదించాం అనేది కాదు.. ఎలా బతికాం అనేది ముఖ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సాయి కళ్యాణ్‌ చక్రవర్తి అన్నారు. చదువు తన కోసమే కాకుండా సమాజం, దేశం కోసం ఉపయోగపడాలన్నారు. న్యాయ సేవల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన

ఆయన మాట్లాడుతూ చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్న తరువాత పుట్టిన ప్రాంతం రుణం తీర్చుకునేందుకు సమయం కేటాయించాలని సూచించారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. చట్టాలు ఎప్పుడూ బాధిత వర్గానికి అండగా నిలు స్తాయన్నారు. తొలుత కేజీబీవీలో వసతులు పరిశీలించారు. అనంతరం మూడో అదనపు కోర్డు, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కె.రాధారత్నం, నాలుగో అదనపు కోర్టు జడ్జి షేక్‌ షికింధర్‌ భాష, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ ప్రాధికార సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి జె.శ్రీనివాసరావులు మాట్లాడుతూ న్యాయపరమైన అంశాలు- చట్టాలపై అవగాహన కల్పించారు. డీఆర్‌వో గణపతిరావు, జిల్లా ఎస్సీఎస్టీ సెల్‌ డీఎస్‌పీ ఆర్‌.శ్రీనివాసరావు, బార్‌ అసోసియేషన్‌ కల్చరల్‌ స్పోర్ట్స్‌ కార్యదర్శి యువీ రాజేష్‌, సమగ్ర శిక్ష ఏపీసీ వేమలి అప్పలస్వామినాయుడు, చైల్ట్‌ వెల్ఫేర్‌ జిల్లా చైర్మపర్సన్‌ హిమబిందు మాట్లాడుతూ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రసన్న రాఘవ, ఇన్‌చార్జి ఎంపీడీవో బానోజీరావు, ఎంఈవో విజయలక్ష్మీ, ఎస్‌ఐ గణేష్‌, కేజీవీబీ ప్రిన్సిపాల్‌ అల్లు జ్యోతి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-11-10T00:23:48+05:30 IST