Nadendla Manohar: వారిని ఆదుకోకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
ABN , First Publish Date - 2022-11-19T20:15:32+05:30 IST
Tirupati: అన్నమయ్య ప్రాజెక్టు (Annamaiah Project) నిర్వాసితులను నెల రోజుల్లోపు ఆదుకోకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని జనసేన పార్టీ (Janasena Party) పీఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) హెచ్చరించారు.
Tirupati: అన్నమయ్య ప్రాజెక్టు (Annamaiah Project) నిర్వాసితులను నెల రోజుల్లోపు ఆదుకోకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని జనసేన పార్టీ (Janasena Party) పీఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) హెచ్చరించారు. ఏడాది గడిచినా నిర్వాసితులకు ప్రభుత్వం సాయం అందకపోవడం బాధాకరమన్నారు. గతంలో తమ పర్యటన నేపథ్యంలో నిర్వాసితుల ఖాతాల్లోకి డబ్బులు వేసినట్లు అధికారులు తప్పుడు ప్రచారం చేశారని, బాధితులకు సాయం చేయలేని జగన్ (CM Jagan) సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. వచ్చేవారం నిర్వాసితులకు తాము మరోసారి సాయం చేస్తామన్నారు. ప్రాజెక్టు స్లూయిజ్ గేట్ మరమ్మతుకు రూ. కోటి ఖర్చు చేసి ఉంటే డ్యాం కొట్టుకు పోయేది కాదని, ఏడాదిలో ప్రాజెక్టు అంచనా వ్యయంపై రూ. 300 కోట్ల పెంచడం దారుణమన్నారు.