అటవీ సంరక్షణ చట్టం 2022ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-09-19T04:38:58+05:30 IST

ఆదివాసీ లు అనేక పోరాటాలతో సాధించుకున్న అటవీ హక్కుల చట్టాలను, అధికారాలను 2022 చట్టంతో పాలకులు పాతరేస్తున్నారని తక్షణమే చట్టాన్ని రద్దు చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పి.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

అటవీ సంరక్షణ చట్టం 2022ను రద్దు చేయాలి
చట్టాన్ని రద్దు చేయాలని గిరిజనుల నిరసన

బుట్టాయగూడెం, సెప్టెంబరు 18 : ఆదివాసీ లు అనేక పోరాటాలతో సాధించుకున్న అటవీ హక్కుల చట్టాలను, అధికారాలను 2022 చట్టంతో పాలకులు పాతరేస్తున్నారని తక్షణమే చట్టాన్ని రద్దు చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పి.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం రామనర్సాపురంలో సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కొండరెడ్డి గిరిజనులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చట్టం వల్ల అడవులనే ఆధారం చేసుకుని జీవిస్తున్న 40 కోట్ల మంది ఆదివాసీల జీవన విధానాలను ధ్వంసం చేస్తుందన్నారు. అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెట్టడానికే మోదీ, షాలు చట్టానిన తెచ్చారని విమర్శించారు. పీవోడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కుర్సం లత, కుర్ల నాగలక్ష్మి, ఏఐకేఎంఎస్‌, న్యూడెమోక్రసీ నాయకులు వేట్ల లచ్చిరెడ్డి, కత్తుల కన్నంరెడ్డి, వేట్ల ముక్కారెడ్డి, వేట్ల సీతారెడ్డి, పీవైఎల్‌ నాయకుడు మాల్చి ప్రసాద్‌ గిరిజనులు  పాల్గొన్నారు.

Updated Date - 2022-09-19T04:38:58+05:30 IST