‘చింతామణి’పై పిటిషన్‌ ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2022-02-03T06:20:29+05:30 IST

చింతామణి నాటకం నిషేధంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య పెద్దలు డిమాండ్‌ చేశారు.

‘చింతామణి’పై పిటిషన్‌ ఉపసంహరించుకోవాలి
మాట్లాడుతున్న ఆర్యవైశ్య ప్రముఖులు

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): చింతామణి నాటకం నిషేధంపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో వేసిన  పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య పెద్దలు డిమాండ్‌ చేశారు.  సంఘం జిల్లా అదనపు కోశాధికారి పేరూరి కాశియ్య, కార్యదర్శి కొనకళ్ల హరనాథ్‌, జిల్లా ప్రతినిధి మండవల్లి నాగేంద్ర, తాడేపల్లిగూడెం వాసవీ క్లబ్‌ ప్రతినిధి ఏకాంబరేశ్వరరావు  విలేకరులతో మాట్లాడారు.  కళాకారులకు తాము వ్యతిరేకం కాదని అయితే నాటకంలో సుబ్బిశెట్టి పాత్రను వక్రీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. రాజకీయాలకతీతంగా తమ మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.  

Updated Date - 2022-02-03T06:20:29+05:30 IST