భీమవరం ప్రభుత్వాసుపత్రికి స్వచ్ఛతలో కాయకల్ప పురస్కారం
ABN , First Publish Date - 2022-08-03T07:05:21+05:30 IST
భీమవరం ఏరియా ఆసుపత్రి వరుసగా మూడోసారి ఈ ఏడాది కూడా కాయకల్ప పురస్కారాన్ని దక్కించుకుంది.
భీమవరం క్రైం, ఆగస్టు 2 : భీమవరం ఏరియా ఆసుపత్రి వరుసగా మూడోసారి ఈ ఏడాది కూడా కాయకల్ప పురస్కారాన్ని దక్కించుకుంది. గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ హయాంలో నిధులు విడుదల కావడంతో వసతులు మరిన్ని పెంచారు. అప్పటి నుంచి ఆసుపత్రి శుభ్రత, సదుపాయాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ఈ ఆసుపత్రికి భీమవరం పట్టణ ప్రజలే కాకుండా చుట్టు పక్కల పాలకోడేరు, ఉండి, వీరవాసరం, ఆకివీడు, కాళ్ల, భీమవర, మొగల్తూరు, కృత్తివెన్ను, కలిదిండి మండలాలకు చెందిన వారు వందలాది మంది రోగులు వస్తుంటారు. సుమారు రోజుకు 400 మంది వైద్య చికిత్స పొందుతారు. పొందుతారు. ఆసుపత్రి ఆవరణ, రోగులకు వైద్య సేవలు, వైద్యుల పరిస్థితి, సిబ్బంది పనితీరు, వాటిని పరిశీలించిన వైద్య బృందాలు ఇచ్చిన నివేదికతో స్వచ్ఛతకు కాయకల్ప పురస్కార ఎంపికకు దోహదపడినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ఎం.వీరాస్వామి తెలిపారు.