జంగారెడ్డిగూడెం జిల్లాగా ప్రకటించాలి
ABN , First Publish Date - 2022-02-02T05:23:57+05:30 IST
జంగారెడ్డిగూడెంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఏఐకెఎంఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 1: జంగారెడ్డిగూడెంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఏఐకెఎంఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నాయకులు జొన్నకూటి వెంకటేశ్వర రావు, తలారి ప్రకాష్ తదితరులు మాట్లాడుతూ గోపాలపురం, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరిధిలోని 11 మండలాలను కలుపుకుని జంగా రెడ్డిగూడెం కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారమైన జంగారెడ్డిగూడెంను జిల్లాగా ప్రకటిస్తూ ఏజెన్సీ ప్రాంతంతో పాటు మెట్ట ప్రాంతం అభివృద్ది చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామలమ్మ, సున్నం సోమరాజు తదితరులు పాల్గొన్నారు.