ప్రతికూల వాతావరణంలో రైతుల పాట్లు
ABN , First Publish Date - 2022-12-09T00:00:50+05:30 IST
ప్రతికూల వాతావరణంలో రైతులు పాట్లు పడుతున్నారు.
పాలకొల్లు రూరల్, డిసెంబరు 8: ప్రతికూల వాతావరణంలో రైతులు పాట్లు పడుతున్నారు. వర్షాలకు ధాన్యం తడిస్తే ధర తగ్గుతుందని దిగులుతో ఉన్నారు. పంట చేతికొచ్చిన దశలో ధాన్యం ఒబ్బిడి చేసుకోడానికి తంటాలు పడుతున్నారు. ధాన్యం ఆరబెట్టి తేమ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏవో అబ్దుల్ రహీం సూచించారు. లంకలకోడేరు, వాలమర్రు, వెంకటాపురం తదితర గ్రామాల్లో సిబ్బందితో కలిసి గురువారం ఆయన రైతులకు సూచ నలు చేశారు. తుఫాన్ కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ధాన్యం తడవకుండా టార్పాలిన్లు, గోదాముల్లో జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.