ఈఎల్స్ సొమ్ములేవీ?
ABN , First Publish Date - 2022-12-21T00:02:09+05:30 IST
ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. సెలవులు మంజూరు కావు. విధుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఆర్జిత సెలవులపై పెదవి విప్పని ప్రభుత్వం
సరెండర్ చేస్తే 15 రోజుల వేతనం ఇవ్వాలి
జిల్లాలో కోట్లలో బకాయిలు..
ఉద్యోగుల ఎదురుచూపు
ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. సెలవులు మంజూరు కావు. విధుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సెలవులు వినియోగించలేకపోతున్నారు. వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తే ఏటా సొమ్ములు జమ చేసేది. కాని, ప్రభుత్వం గత ఏడాది నుంచి చేతులెత్తేసింది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
సంక్రాంతి, క్రిస్మస్ సమయంలో అత్యధిక మంది ఉద్యోగులు ఆర్జిత సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తుంటారు. పండు గ ఖర్చులు దాటిపోతాయన్న ఉద్దేశంతో ధీమాగా ఉంటారు. టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగుల ఖాతాలకు కచ్చితంగా ఆర్జిత సెలవుల సొమ్ము జమచేసేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అన్ని విధాలా నష్టపోతు న్నారు. డీఏలు సక్రమంగా మంజూరు చేయలేదు. ఫలితంగా ఒక్కో ఉద్యోగికి వేలల్లోనే నష్టం వాటిల్లింది. ఎరియర్స్ ఇవ్వక పోవడంతో పోలీస్ శాఖలోనే ఒక్కో ఉద్యోగికి సగటున రూ. 1.50 లక్షలు నష్టపోయారు. ఇతర శాఖల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం అంతటితో ఆగలేదు. ఎప్పటి నుంచో ఆర్జిత సెలవు లపై సొమ్ములు జమ చేస్తున్న ఆనవాయితీకి చెక్‌పెట్టింది. గత ఏడాది ప్రభుత్వానికి సరెండర్ చేసిన సెలవులకు సంబంధించి ఇప్పటి వరకు సొమ్ములు జమ చేయలేదు. దీంతో ఈ సారి అనేక మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవడాన్నే విరమించు కున్నారు. ట్రెజరీ కార్యాలయంలో ఆర్జిత సెలవులకు సంబంధిం చి ప్రభుత్వానికి బిల్లులు సమర్పించారు. అప్పటి నుంచి ఉద్యో గులు ఎదురుతెన్నులు చూస్తున్నారు. ప్రతి ఉద్యోగికి ఏడాదిలో 27 ఆర్జిత సెలవులుంటాయి. 300 సెలవుల వరకు ఉద్యోగ విర మణ సమయంలో సొమ్ములు చెల్లిస్తుంది. సీనియర్ ఉద్యోగు లకు అంతకుమించే ఉంటాయి. ఉద్యోగ విరమణ వరకు ఆర్జిత సెలవులు ఉంచుకోకుండా ప్రభుత్వానికి ముందుగానే సరెండర్ చేసినా.. 300 పరిమితికి మించి సెలవులపై దరఖాస్తు చేసుకు న్నా విధిగా సొమ్ములు జమచేయాలి. ఆర్జిత సెలవులపై జన వరి నుంచి డిసెంబరు వరకు లెక్కిస్తారు. ప్రతి ప్రభుత్వ ఉద్యో గికి 27 సెలవులు వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కాని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉండడం లేదు. ఉద్యోగులు నిత్యం విధులతో సతమతం అవుతున్నారు. క్యాజువల్ సెలవులు ఉంటున్నాయి. అవి కూడా వినియోగించుకోలేని ఉద్యోగులు ఉన్నారు. ఆర్జిత సెలవులు వినియోగించుకోలేకపోతే ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. ఒక్కో ఉద్యోగికి 15 రోజుల సెలవులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. దీనికి సంబంధించి సొమ్ములు జమ చేస్తుంది. అంటే ప్రతి ఉద్యోగికి నెలలో సగం వేత నాన్ని అదనంగా ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్జిత సెలవుల కోసం కోట్లాది రూపాయలు చెల్లించాలి.
జిల్లాలో పరిస్థితి ఇదీ
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 14 వేల మంది ఉన్నారు. కొత్తగా చేరిన సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ చేసింది. వారికి సెలవులు ఉంటున్నాయి. మొత్తంగా ఉద్యోగులంతా డిసెంబరు మాసాంతంలో ప్రభు త్వానికి ఆర్జిత సెలవులను సరెండర్ చేస్తారు. అందుకు సంబంధించి ప్రతి ఉద్యోగికి నెలలో సగం వేతనం ఇవ్వాలి. ఉద్యోగులంతా ఆరోగ్య పరిస్థితులు ఉత్పన్నమైతే తప్ప సెలవులు తీసుకునే అవకాశం లేదు. కొన్ని శాఖల్లో ఆది వారం కూడా విధులు నిర్వహించే పరిస్థితులు ఉంటున్నాయి. రెవెన్యూ శాఖలో సమయపాలన లేకుండా బాధ్యతలు నిర్వహిస్తుంటారు. సెలవు మంజూరు చేసే అవకాశాలు తక్కువ. ఇటీవల అన్ని శాఖల్లోనూ ఇదే దుస్థితి. టెలి కాన్పరెన్స్‌లు, వీడియో కాన్పరెన్స్‌లు, సమావేశాలు అంటూ కాలం వృథా చేస్తున్నారు. ఆ తర్వాత తమ విఽధి నిర్వహణలో నిమగ్నమవుతున్నారు. అయినా ప్రతి ఏటా ఆర్జిత సెలవులు సరెండర్ చేస్తే సొమ్ములు వస్తాయన్న సంతృప్తి ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బిల్లులు పెట్టుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదు.