మొలకెత్తిన నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2022-11-05T00:59:55+05:30 IST
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలనుకున్నారో ఏమో కాని ప్రభుత్వ అధికారుల మాత్రం ఇదిగో ఇలా ప్రభుత్వ భవనాలపైనే మొక్కలను పెంచుతున్నారు.
(నూజివీడు టౌన్)
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలనుకున్నారో ఏమో కాని ప్రభుత్వ అధికారుల మాత్రం ఇదిగో ఇలా ప్రభుత్వ భవనాలపైనే మొక్కలను పెంచుతున్నారు. చారిత్రక భవనాలైన ఎమ్మార్ అప్పారావు పీజీ సెంటర్, ఎస్‌ఆర్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాల నూజివీడు బాలికోన్నత పాఠశాల, చివరికి నూజివీడు సబ్ కలెక్టర్ ప్రధాన భవనంపై సైతం ఇదిగో ఇలా మర్రి, రావి చెట్లు ఊడలు వేసేందుకు సిద్ధమవుతున్నాయి. నూజివీడు ఎస్.ఆర్.ఆర్ బాలుర ఉన్నత పాఠశాలను ఏడాది క్రితమే కోట్లాది రూపాయలు వెచ్చించి, నాడు–నేడు కింద అభివృద్ధి పరిచారు. అయితే నిర్లక్ష్యం మొలకెత్తి, మొక్కల రూపంలో భవనాలపై పెరుగుతుండటంతో పాఠశాలకు వచ్చే తల్లిదండ్రులు ముక్కున వేలేసుకునే పరిస్థితి నెలకొంది. భావితరాలకు ఈ జమీందారీ భవనాలను అందించాలంటే ఊడలు వేయకముందే ఈ నిర్లక్ష్యపు మొలకలను తీసి వేయాలని పలువురు కోరుతున్నారు.